పామర్రు నిభానుపూడి మైనర్ బాలికపై అత్యాచారంజరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నిభానుపూడిలో బాలిక కుటుంబాన్ని హోంమంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.