నంద్యాల జిల్లాలోని పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో బోయ మధు అనే వ్యక్తి ఉంటున్న ఇంట్లో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. ఆయన ఇంటిపైన ఉన్న సింటెక్ ట్యాంక్లో రెండు కవర్లలో 22 నాటు బాంబులు లభించాయి. సింటెక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా 22 నాటు బాంబులు బయటపడ్డాయి. విషయం తెలిసిన ఇంటి యజమాని బోయ మధు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు 22 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వాటర్ సింటెక్స్లో బాంబులు ఎవరు ఉంచారనే దానిపై దర్యాప్తు చేపట్టారు.