కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు పొందిన వారంతా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు పాస్ కావాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఫిబ్రవరి 24న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కారుణ్య నియామకాలు పొందిన వారంతా సీపీటీ పాస్ కావాల్సిందేనని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. టైపిస్టు, లోయర్ డివిజన్ టైపిస్ట్, అప్పర్ డివిజన్ టైపిస్టు, టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులకు ఇంగ్లీష్, తెలుగు టైప్ రైటింగ్ పరీక్ష ఉత్తీర్ణత కలిగి ఉండాలన్న అర్హతను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆయా ఉద్యోగాల్లో కారుణ్య నియామకాలు పొందిన వారంతా సీపీటీ అర్హత కలిగి ఉండాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.