నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం ఒంగోలు నగరానికి చేరుకోనుంది. సంతనూతలపాడు శివారులో సోమవారం రాత్రి బస చేసిన లోకేష్ మం గళవారం సాయంత్రం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించి సంతనూతలపాడు, ఎండ్లూరు డొంక, పే ర్నమిట్టల మీదుగా రాత్రికి ఒంగోలులోకి ప్రవేశించనున్నారు. మూడు రోజులపాటు నగరపరిధిలో ఉండే లోకేష్ మంగళవారం రాత్రి కర్నూలు రోడ్డులోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ సమీపంలో బసచేస్తారు. బుధవారం సాయంత్రం నగరంలోని ప్రధాన వీధుల్లో సుమారు పది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక మంగమూరు రోడ్డులో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రికి గుంటూరు రోడ్డులోని క్యాంపుసైట్లో బస చేస్తారు.