మంగళవారం బెంగళూరులో రూ.2000 జిరాక్స్ నోట్లతో కూడిన రెండు పెట్టెలను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో తలఘట్టపురలో సంచలనం నెలకొంది. కనకపుర రోడ్డు పక్కన రెండు పెట్టెల జిరాక్స్ నోట్లు పడి ఉండటాన్ని చూసిన ప్రజలు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే సమాచారం అందుకున్న తలఘట్టపుర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేసి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. జిరాక్స్ నోట్లు ఘటనా స్థలానికి ఎలా చేరాయి అనే కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.