ఉత్తర ఆంధ్ర-దక్షిణ ఒడిశా తీరం వెంబడి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడి బుధవారం నాటికి తుపానుగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. అల్పపీడనంతో పాటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.