కడప తిరుపతి రహదారిపై బస్సు ప్రమాదవంలో కమలాపురం మండల కోగటంకు చెందిన కమాల్ భాష మృతి చెందడంతో మంగళవారం ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 10లక్షలు చెక్కును ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అందించారు. కమాల్ బాషా కుటుంబాన్ని సీకేదిన్నె జడ్పీటీసీ నరేన్రెడ్డి, ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, రాష్ట్ర హార్టికల్చర్ ప్రభుత్వ సలహాదారులు ప్రసాద రెడ్డితో కలిసి పరామర్శించారు.