మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి 350 క్యూసెక్కుల నీరు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. మైలవరం జలాశయం నార్త్ కెనాల్క 100 క్యూసెక్కులు సౌత్ కెనాల్క 120 క్యూసెక్కులు, ఆర్టీపీపీకి 36 క్యూసెక్కులు, జలాశయం నుంచి బయటకు 606 క్యూసెక్కుల నీటిని బయటకు పంపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మైలవరం జలాశయంలో బుధవారం ఉదయం నాటికి 3. 44 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు