నేడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మణిపూర్ హింసపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు, అవిశ్వాసం పెట్టేందుకు నేడు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీనికోసం ఇప్పటికే ముసాయిదా సిద్ధమైందని, 50 మంది ఎంపీలతో సంతకం చేయించాల్సి ఉందని వెల్లడించాయి. కాగా, లోక్ సభలో మ్యాజిక్ ఫిగర్ 272 కాగా, ఎన్డీఏకు 330, విపక్ష కూటమికి 130 మంది సభ్యుల మద్దతుంది.