వాల్తేర్ రైల్వే డివిజన్ కొరాపుట్-కిరండూల్ మార్గంలో మంగళ బుధవారాల్లో డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ పర్యటించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన మొదటి సారిగా ఈ తనిఖీలు చేపట్టారు. సెక్షన్లో రైల్వే సైడింగ్లు, కాలనీలు, ఎన్ఎండీసీ గనుల ప్రాంతాలను పరిశీలించారు. రైలు పట్టాలు, వంతెనలు, మలుపులు, క్రాసింగ్ పాయింట్లలో విండ్ టైలింగ్ తనిఖీలు చేశారు. కిరం డూల్-జగదల్ పూర్ డబ్లింగ్ పనులు, సైడింగ్ పనులను పరిశీలించారు.