ప్రతిపక్షాల ఆందోళనల నడుమ లోక్సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇవాళ సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. మణిపూర్ ఘటనపై ఎంపీలు నినాదాలు చేశారు. కాగా ఈ అంశంపై చర్చకు పట్టుబట్టినా మోదీ ప్రభుత్వం స్పందించక పోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి.