అమరావతి పై బిజెపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారంతో 1032వ రోజుకు చేరాయి. అమరావతిని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా గుర్తించిందని పురందేశ్వరి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు