జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు అవసరమైన 11 రకాల సర్టిఫికెట్లను తక్షణమే అందజేస్తున్నామని రేపల్లె తహసిల్దార్ మల్లికార్జునరావు తెలిపారు. బుధవారం రేపల్లె రూరల్ మండలం వడ్డీవారి పాలెం పంచాయతీలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో తహసిల్దార్ పాల్గొని అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఈఓపిఆర్డి మల్లికార్జునరావు, వడ్డీవారి పాలెం సర్పంచ్ సునీత, పాల్గొన్నారు.