ప్రజల ముంగిటికే రెవెన్యూ సేవలు అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెరుకుపల్లి తహసిల్దార్ బి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూరేటి శ్రీనివాసరావు, విఆర్ఓ అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.