ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొరలుతున్నాయి. మునేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణా నదికి వరద నీరు భారీగా చేరుతుంది. తాడేపల్లి పరిధి సీతానగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద బుధవారం అధికారులు 70 గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తి 51 వేల940 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతంలో నివసించే వారిని రెవిన్యూ అధికారులు అప్రమత్తం చేశారు.