17 చోరీలకు పాల్పడిన గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన వ్యక్తులను మంగళవారం మండపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి సుమారు రూ. 50లక్షల విలువ చేసే వెండి, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గుంటూరుకు చెందిన రాయపాటి వెంకయ్య, మంగళగిరికి చెందిన కావాటి అంజయ్య, నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన సాంబశివరావుగా గుర్తించారు.