మెంటాడ మండలంలోని గుర్ల గ్రామంలో పట్ట పగలే ఓ ఇంటిలో చోరీ జరిగిన ఘటన మంగళవారం జరిగింది. 15 తులాల బంగారం, రెండు లక్షల నగదు చోరీ జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో కోరాడ సత్యం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపుకు వేసిన తాళాలు పగలు గొట్టి బంగారం, నగదు అపహరించారు. దీంతో సదరు బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు.