వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఐదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ నాలుగేళ్లలో వర్షాలు సాధారణ వర్షాపాతం కంటే ఎక్కువ నమోదైన సందర్భాలు తప్ప తక్కువ అనే పరిస్థితులు ఎక్కడా లేవు. వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో కరువు మండలం ఒక్కటి కూడా ప్రకటించిన సందర్భాలు లేవు అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి తెలియజేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సగటున ఏడాదికి 300లకు పైగా కరువు మండలాలు ప్రకటించిన చరిత్ర గతంలో ఉండేది. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు సంవత్సరాల్లో భూగర్భ జలాలు ఏ విధంగా వృద్ధి చెందాయో అనేక సర్వేలు, అధ్యయనాల రిపోర్టుల్లో చూశాం. చంద్రబాబు ఈ మధ్య జోకులు మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలేదు, నేను బ్రహ్మాండంగా ఆదుకున్నా.. వ్యవసాయానికి పెద్దపీట వేశా.. నా రోజులు రావాలని కోరుకుంటున్నా.. రైతులకు అన్నదాత పథకం కింద ఏడాదికి రూ.20 వేల సాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు వింటుంటే సిగ్గుగాఉంది అని అసహనం వ్యక్తపరిచారు.