శ్రీకాకుళం జిల్లా అరకు లోక్సభ స్థానం పరిధిలోని కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ శాసనసభ స్థానాలకు వైయస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను నియమించారు. ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి బొత్స సత్యనారాయణను ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.