వివేకా హత్య కేసులో తన కూతురు సునీతా మాట్లాడిన మాటలపై సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. వైయస్ వివేకానందరెడ్డి కూతురు సునీత చెప్పేవన్నీ అబద్ధాలేనని అయన పేర్కొన్నారు. భారతమ్మ, తాను కలిసి సునీత ఇంటికి వెళ్లలేదని, అవినాష్‌రెడ్డిని డిఫెండ్ చేయమని నేను చెప్పలేదన్నారు. వివేకా పరువు కాపాడాలని అవినాష్ కుటుంబం ప్రయత్నించిందని, మూడేళ్లుగా అవినాష్ కుటుంబం ఎంతో బాధ అనుభవిస్తోందని చెప్పారు. సీబీఐ ఛార్జ్‌షిట్‌లో అన్ని కల్పిత కథలే అని కొట్టిపారేశారు. ముందే దోషులను నిర్ణయించుకొని కథలు అల్లారని తెలిపారు.