వ్యవసాయరంగం బాలేదని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడు. ఏడాదికి సగటున 12 నుంచి 14 లక్షల టన్నుల ధాన్యం అధికంగా ఉత్పత్తి అవుతుందని చెబుతున్నాయి. అంటే వ్యవసాయరంగం బాగున్నట్టా.. లేక సంక్షోభంలో ఉన్నట్టా చంద్రబాబే చెప్పాలి అని కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయన మీడియా తో మాట్లాడుతూ... ఉచిత విద్యుత్‌పై చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని పాంప్లేట్లు పంపిణీ చేశాడు. బషీర్‌బాగ్‌లో రైతుల మీద జరిపిన కాల్పులను ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం. కాబట్టి ఎవరైనా 9 గంటల పగటి పూట కరెంటు ఉండి, సమృద్ధిగా నీరు ఇచ్చే ప్రభుత్వాన్ని కోరుకుంటారా.. లేక చంద్రబాబులా రెయిన్ గన్‌లతో కరువును జయించానని చెప్పుకునే ఆ పరిపాలనను కోరుకుంటారా అనేది రైతాంగం దగ్గరకు వెళ్తే స్పష్టంగా తెలుస్తుంది అని తెలియజేసారు.