ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ తమను ఉగ్రవాద సంస్థతో పోల్చారని, అయితే అమిత్ షా ప్రతిపక్షాల సహకారం కోరుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల కూటమి ఇండియాకు దశ, దిశ లేదని మోదీ అనడం దురదృష్టకరమన్నారు. ఉగ్రవాదులంటూ ఆరోపించేది ఒకరు, సహకరించాలంటూ కోరేది మరొకరు. అంటూ ఎద్దేవా చేశారు.