వందేభారత్ రైళ్లు జంతువులను ఢీకొన్న సంఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. గాంధీనగర్, ముంబై సెంట్రల్ మధ్య నడిచే వందే భారత్ రైలు (20902) ఆవును ఢీకొట్టిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ ఎక్స్ప్రెస్ రైలు ఉంబెర్గావ్-ఘోల్వాడ్ సెక్షన్ గుండా వేగంగా వెళుతున్న ఆవును ఢీకొంది. ఈ క్రమంలో రైలు ముందు భాగం దెబ్బతింది. కాగా ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు రైలు మొత్తం మార్గంలో కంచె ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారి తెలిపారు.