గుడ్లూరు మండలం పొట్లూరు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మరియు నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో రు. 6, 70, 000 వ్యయంతో ఏర్పాటు చేసిన నర్సరీని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మొక్కలు ఈ నర్సరీల ద్వారా లభ్యమవుతాయని, మొక్కల సంరక్షణ పనులు ఉపాధి అధికారులు పర్యవేక్షిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.