ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చెరువు కట్టపై రోడ్డును మరమ్మత్తులు చేయాలంటూ బిజెపి శ్రేణులు శుక్రవారం నిరసన తెలియజేసారు. మార్కాపురం నుండి ఒంగోలుకు వెళ్లే రహదారి గత కొన్ని రోజులుగా గుంతలతో అధ్వాన పరిస్థితుల్లో ఉంది. నిర్మాణం చేపట్టాలని ఎన్నిసార్లు అధికారులకు నాయకులకు తెలియజేసినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని నిరసన కార్యక్రమం చేపట్టినట్లు అసెంబ్లీ కన్వీనర్ పీవీ కృష్ణారావు అన్నారు.