కేరళ తిరువనంతపురంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో కాలిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తాజాగా వైరల్ గా మారాయి. ఈ ఘటనపై జులై 19న నెడుమంగడ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. అగ్నిప్రమాదానికి కారణం ఏంటనే దానిపై విచారణ జరుగుతోంది. పోలీసులు కంపెనీకి మెయిల్ పంపినట్లు చెబుతున్నారు. ఇంటి ఆవరణలో బైక్ ఉంచగా ప్రమాదం జరిగిందని బాధితుడు తెలిపినట్లు సమాచారం.