రాష్ట్రంలో మహిళా సంక్షేమం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తోనే సాధ్యం అవుతుందని తెలుగు మహిళా నాయకురాళ్ళు అన్నారు. గురువారం గుంతకల్లు మండలంలోని ఎన్. కొట్టాల, నక్కనదొడ్డి గ్రామాల్లో మహిళాశక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి వరలక్ష్మి, మహిళా విభాగం నాయకురాళ్ళు సరోజమ్మ, లక్ష్మీదేవి, అంజలీదేవి, మాధవి, పద్మ తదితరులు ఇంటింటికీ తిరిగి టిడిపి మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు.