రైల్వే శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను ఉపాధి భద్రత కల్పించి, కనీస వేతనం 25 వేలు ఇవ్వాలని సీఐటియూ పట్టణ కార్యదర్శి బి. శ్రీనివాసులు కసాపురం రమేష్ డిమాండ్ చేశారు. రైల్వే కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై సీఐటియూ జిల్లా కమిటీ ముద్రించిన కరపత్రాలను గురువారం గుంతకల్లు రైల్వే స్టేషన్లలో కార్మికులతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాకే నాగరాజు, కుమార్, రైల్వే కార్మికులు పాల్గొన్నారు.