ఖరీఫ్ సీజన్ సంబంధించి సాగు చేసిన పంటలకు ఈ క్రాఫ్ట్ బుకింగ్ చేయించుకుంటేనే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఉరవకొండ డివిజన్ ఏడిఏ పద్మజ పేర్కొన్నారు. గురువారం ఈక్రాఫ్ బుకింగ్ చేసే విధి విధానాలపై ఉరవకొండలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని మండల వ్యవసాయ అధికారులు గ్రామ అగ్రికల్చర్, సెరికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లతో పాటు ఎంపీఈఓలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం ఎంఏఓ శుభకర్ ఆధ్వర్యంలో జరిగింది.