ఉరవకొండ పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న హరిజన గంగన్నకు గురువారం ఎమ్మేల్యే పయ్యావుల కేశవ్ సోదరుడు పయ్యావుల శ్రీనివాసులు సూచనల మేరకు టిడిపి నాయకులు 10 వేలు విలువైన నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ దేవినేని పురుషోత్తం, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రేగటి నాగరాజు, మండల కన్వీనర్ విజయభాస్కర్, టిడిపి నాయకులు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.