తుని మండలం కొత్తూరు గ్రామానికి చెందిన దిడ్డి శంకర్ (40) ట్రాక్ పనుల నిమిత్తం వినుకొండకు పట్టణంకు వచ్చాడు. అయితే కాలకృత్యాలు తీర్చుకునే నిమిత్తం, రైల్వే ప్లాట్ఫాం చివరకు వెళ్లిన సమయంలో గురువారం ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి తలకు గాయమై స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అటు వైపు వస్తున్న గూడ్స్ రైలు శంకర్ పై నుంచి వెళ్లడంతో తల, మొండెం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు.