రైతు కుటుంబాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ఉరవకొండ బ్రాంచ్ కృషి చేస్తుందని బ్రాంచ్ మేనేజర్ ఎం మల్లికార్జున పేర్కొన్నారు. గురువారం వెహికల్ లోన్ మంజూరు విధివిధానాలపై తన చాంబర్లో రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు తక్కువ శాతం వడ్డీతో వెహికల్ లోన్లు ఇస్తామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సహకార సంఘం సొసైటీ చైర్మన్ శ్రీరాములు, రైతులు పాల్గొన్నారు.