రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లి గ్రామం నందు 33 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శుక్రవారం భూమి పూజ చేసిన తర్వాత 40 లక్షల రూపాయలతో జరిగిన చెరువు కట్ట మరమ్మత్తులను ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసన సభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్ రెడ్డి, ఏపీ టూరిజం డైరెక్టర్ నాగేంద్ర పాల్గొన్నారు.