హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్లి పిడుగుపాటుకు గురైన భారతీయ విద్యార్థిని సుశ్రూణ్య (25) కోమా నుంచి బయటికి వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆమెకు వెంటిలేటర్‌ను తొలగించినట్లు డాక్టర్లు తెలిపారు. ‘‘గత వారం నుంచి ఆమె వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకుంటోంది.నిజంగా అద్భుతం జరిగిందనే చెప్పాలి. వైద్యుల బృందం నిరంతరం సుశ్రూణ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు’’ అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.