శింగనమల మండల కేంద్రంలో శుక్రవారం మొహరం వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్నజలాలపురం, గురుగుంట్ల, గోవిందరాయుని పేట గ్రామాల పీర్ల స్వాములు శింగనమల లో కలవడం జరిగింది. ఈ మూడు గ్రామాల నుండి వచ్చిన పీర్ల స్వాములతో గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తుల రద్దీతో గ్రామం కిటకిటలాడిందని చెప్పవచ్చును. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శింగనమల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa