ఉమ్మడి అనంతపురం జిల్లాలో వచ్చే నెల 3న టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నట్లు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న నీటి ప్రాజెక్టులను చంద్రబాబు పరిశీలిస్తారని తెలిపారు. అదే రోజు రాత్రి అనంతపురంలో బస చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిటాల సునీత పాల్గొన్నారు.