ఎచ్చెర్ల: ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి శారీరకంగా, మానసికంగా దృడంగా ఉండాలని జిల్లా ఎస్పీ జి. ఆర్. రాధిక పోలీసు సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో నిర్వహించిన పోలీసు పరేడ్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జి. ఆర్. రాధిక హాజరయ్యి, పరేడ్ ను పరిశీలించారు. పరేడ్ లో భాగంగా సిబ్బంది ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించారు. పోలీసు శాఖలో సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యం అన్నారు.