భారీ వర్షాలతో మహారాష్ట్ర రాజధాని ముంబై తడిసిముద్దవుతోంది. పొరుగున ఉన్న థానే, రాయ్ గఢ్ జిల్లాలోనూ భారీ వర్షపాతం నమోదవుతోంది. శుక్రవారం ముంబైకు ఐఎండీ యల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ముంబై-పుణే ఎక్స్ ప్రెస్ హైవేపై కంటెంట్ టన్నెల్ వద్ద గురువారం రాత్రి కొండచరియలు విరిగి పడడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.