ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయం గురించి చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, అవాస్తవాలేనని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.27,394 కోట్లు ప్రాజెక్టులకు ఖర్చు చేశామని, నిన్న చంద్రబాబు తప్పుడు లెక్కలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు రాయలసీమకు ఏమీ చేయలేదని, వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్ మోహన్ రెడ్డిలే సీమకు మేలు చేశారన్నారు. తనకు లాభం వచ్చే ప్రాజెక్టులను చంద్రబాబు ప్రారంభించి పూర్తి చేయకుండా కమీషన్లు దండుకున్నారని విమర్శించారు. అశాస్త్రీయంగా రూ.1600 కోట్లు చంద్రబాబు వృథా చేశారని మండిపడ్డారు.