రాయలసీమ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు కానీ, ఆయనను సమర్థిస్తున్న దుష్ట చతుష్టయానికి ఇక్కడి ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వైయస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, ఏనాడూ ఎక్కడా ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయకపోగా 40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టును 4 టీఎంసీలకు కుదించి రెండు సార్లు శంకుస్థాపన చేసి గంపెడు మట్టి కూడా తీయలేదని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు.