ఒక క్రిమినల్ కహానీ అల్లి మహిళా పక్షపాతి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కళ్యాణ్ కుట్ర అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చేసిన ప్రకటనను చూపించి దానిపై పవన్ అనేక వక్రీకరణలు చేస్తున్నారని, మొదటి పది స్థానాల్లో ఉన్న రాష్ట్రాల గురించి మాట్లాడకుండా, తెలుగు రాష్ట్రాల సంబంధించిన మహిళల అదృశ్యం గురించి మాట్లాడటం వెనుక ఉద్దేశాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మహిళల అదృశ్యంలో ఏపీ దేశంలో 11వ స్థానంలో ఉందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించటం లేదని ప్రశ్నించారు. 6వ స్థానంలో ఉన్న తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.