మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి అని చెప్పిన వ్యక్తి పవన్. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని పవన్ పార్ట్నర్ మాట్లాడుతాడు.. ఒకడు అమ్మాయి కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అంటాడు. మీరు చేసే వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ప్రశ్నించకూడదా..? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మిమ్మల్ని ప్రశ్నించడమే కాదు.. కనబడితే, ఎదురుపడితే లాగి లెంపకాయ్ కొట్టాలని మహిళా కమిషన్‌కు అనిపిస్తుంది. కానీ, బాధ్యతాయుతమైన వ్యవస్థలో ఉన్నాం కాబట్టే నోటీసులతో సరిపెట్టుకుంటున్నాం. సినీ, రాజకీయ నాయకుల తీరుపై చర్చ జరగాలి. పవన్‌కు రాష్ట్రం మీద కోపమా.. రాజకీయ కోపమా..? రాష్ట్రానికే కట్టప్పల్లా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్రం పై దాడి. మహిళా కమిషన్‌కు రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ స్థాయిలో చర్యలు తీసుకుంటూ ఉంటే పొగడకుండా ఎలా ఉంటాం అని ఆమె తెలియజేసారు.