2014-19 వరకు టీడీపీ, జనసేన భాగస్వామ్య ప్రభుత్వమే. అప్పుడు ఎందుకు మహిళల గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు..? మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని, వారి కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రభుత్వం మెజార్టీ పథకాలను మహిళల పేరు మీదనే అమలు చేస్తుంది అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆడపడుచుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా ప్రభుత్వ సాయం జమ అవుతుంది. గౌరవంగా, హక్కుగా మహిళలు సంక్షేమ పథకాలు పొందుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తుంటే వారిని అవమానిస్తారా..? పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు.. విషపుత్రుడు కూడా అని ఆమె ఆరోపించారు.