గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం శ్రీ వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షం సహా ఉప నదులు పొంగి ప్రవహిస్తుండడంతో గోదావరి నదీతార ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని సీఎం ఆదేశించారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో పరిస్థితులను సీఎంఓ అధికారులు వివరించారు. 42 మండలాల్లో, 458 గ్రామాలు అప్రమత్తంగా ఉన్నాయని. సహాయచర్యల్లో 3 NDRF, 4SDRF బృందాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అంతేకాక భారీవర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల్లోని వివరాలనుకూడా సీఎంకు వెల్లడించారు.