విశాఖ ఎయిర్‌పోర్టులో నలుగురు అనుమానితుల్ని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతా నుంచి గురువారం విమానం దిగి బయటకు వస్తుండగా.. కస్టమ్స్ అధికారులు స్కానింగ్ చేశారు. ఈ క్రమంలో ఒకరి దగ్గర బూటులో బటన్ నైఫ్‌ను గుర్తించారు. అతడి పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్న సీఐఎస్‌ఎఫ్ అధికారులకు అప్పగించారు. సీఐఎస్‌ఎఫ్‌తో పాటుగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు వారిని ప్రశ్నించిన తర్వాత ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. వీరు నలుగురు కోల్‌కతా నుంచి చెన్నైకు వైద్యం కోసం వెళుతున్నట్లు చెబుతున్నారు. అతడి దగ్గర బటర్ నైఫ్ ఎందుకు ఉందని ఆరా తీస్తున్నారు. ఈ నలుగురు బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి ఎలా వచ్చారు. కోల్‌కతా నుంచి విశాఖ ఎందుకు వచ్చారు.. చెన్నైకు వెళ్లాల్సిన వాళ్లు విశాఖకు రావడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. వారి పాస్‌పోర్టుల్ని తనికీ చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.