తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కృష్ణగిరి ప్రాంతంలో బాణసంచా భద్రపర్చిన గోదాంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ గోదాం నివాస సముదాయాల మధ్యలో ఉండటంతో పేలుడు ధాటికి మూడు ఇళ్లు కుప్పకూలాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa