జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో ఇవాళ ఉదయం ల్యాండ్‌మైన్ పేలింది. దేగ్వార్ ప్రాంతంలోని టెర్వాన్ ఖోఖ్రీ పోస్ట్ సమీపంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెల్లవారుజామున 4 గంటలకు ల్యాండ్‌మైన్ పేలినట్లు అధికారులు గుర్తించారు. ఆర్మీ దళాలు వెంటనే ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. సరిహద్దులో ఉగ్రవాదులు చొరబడకుండా వీటిని ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa