పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు మండలాల్లో ముంపునకు ఆస్కారం గ్రామాల్లో అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. సహాయక శిబిరాల్లో ఎలాంటి కొరతా లేకుండా చూసుకోవాలని, తాగునీరు సహా ఇతరత్రా సదుపాయాలు విషయంలో ఎక్కడా లోటు రాకూడదని సీఎం ష్టంచేశారు. సహాయక చర్యల విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, ఆమేరకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టంచేశారు. వరదప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కోసం సీఎం ఆదేశాల మేరకు ముందస్తుగా ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశామని అధికారులు చెప్పారు.