మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పోలీసులపై వరాల జల్లు కురిపించారు. రొటేషన్ పద్ధతిలో పోలీసులకు వీకాఫ్ ఇస్తామని ప్రకటించారు. వాహన సదుపాయం లేని స్టేషన్లలో సిబ్బందికి నెలకు 15 లీటర్ల పెట్రోల్ ఉచితంగా ఇస్తామన్నారు. 45 ఏళ్ల పైబడిన పోలీసులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల పౌష్టికాహార భత్యాన్ని రూ.650 నుంచి రూ.1,000 కి, యూనిఫాం అలవెన్స్ రూ.5 వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు.