రాయలసీమ ద్రోహిగా ఇరిగేషన్ ప్రాజెక్టులను సీఎం జగన్ నాశనం చేశాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయలసీమ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తే సీఎం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ఖర్చుపెట్టిన రూ. 15 వేల కోట్లలో ఏ ప్రాజెక్టులో అయినా నీళ్లు ఇచ్చారా? ఎన్ని పూర్తి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.